
మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌కు దక్షిణాదిన ఇతర భాషల్లోనూ మంచి క్రేజ్ ఉంది. తెలుగులో అతను జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడీ చిత్రాల్లో నటించాడు. ఇటీవల ‘మార్కో’ చిత్రంతో మంచి సక్సెస్‌ను అందుకున్న ఉన్ని.. తాజాగా తన కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. జోషి దర్శకత్వంలో మరో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేయనున్నాడు. డైరెక్టర్ జోషి బర్త్‌డే సందర్భంగా మంగళవారం ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఉన్ని ముకుందన్ ఫిలింస్, ఐన్స్టిన్ మీడియా సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.
జోషి డైరెక్షన్‌లో వచ్చిన చిత్రాలు తర తరాలకు స్ఫూర్తిగా నిలిచాయి. ఇప్పుడు ఆ అనుభవంతో, ఈ తరం స్టోరీ టెల్లింగ్ పవర్‌తో, ఒక భారీ యాక్షన్ మూవీ తీసేందుకు రెడీ అవుతున్నారు. అభిలాష్ ఎన్. చంద్రన్ ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు.హీరోగా ఉన్ని ముకుందన్ తన కెరీర్‌లో ఎప్పుడూ చూడని లుక్‌లో, మాస్ యాక్షన్ అవతార్‌లో కనిపించనున్నాడని మేకర్స్ తెలియజేశారు. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ ప్రకటిస్తామన్నారు.