లెజెండ్స్ క్రికెట్ యుద్ధం

లెజెండ్స్ క్రికెట్ యుద్ధం

మాజీ క్రికెటర్ల మహాయుద్ధం త్వరలో మొదలవబోతుంది. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన లెజెండ్స్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టబోతున్నారు. టెస్టులు, వన్డేల్లో కళాత్మక ఇన్నింగ్స్లతో క్రికెట్కే వన్నె తెచ్చిన ఆటగాళ్లు..ధనాధన్ ఇన్నింగ్స్ దుమ్మురేపనున్నారు.లెజెండ్స్ క్రికెట్ లీగ్ సెకండ్ సీజన్తో ఫ్యాన్స్ను అలరించేందుకు సిద్దమవుతున్నారు. 

లెజెండ్స్ లీగ్ షెడ్యూల్..
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 8వ వరకు జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఇండియా మహరాజాస్‌, వరల్డ్‌ జెయింట్స్‌ మధ్య  సెప్టెంబర్ 16న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా చారటీ మ్యాచ్‌ జరగనుంది. ఆ తర్వాత 17న అసలైన మ్యాచ్ తో టోర్నీ ఆరంభం కానుంది.  సెప్టెంబర్ 21 నుంచి 22 వరకు లక్నోలో.. సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు న్యూఢిల్లీలో కొన్ని మ్యాచులు జరగనున్నాయి. సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు కటక్(బారాబతి స్టేడియం), అక్టోబర్1 నుంచి 3 వరకు జోధ్‌పూర్ వేదికగా లీగ్ మ్యాచులు జరగనున్నాయి.  అక్టోబర్ 5 నుంచి 7 వరకు ప్లే ఆఫ్ లు జరగనున్నాయి. అక్టోబర్ 8 ఫైనల్ జరగనుంది. 

గంగూలీ వర్సెస్ మోర్గాన్..
ఇండియా మహరాజాస్‌ జట్టుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కెప్టెన్సీ వహించనున్నాడు. రెస్టాఫ్ వరల్డ్‌ జెయింట్స్‌కు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యం బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ రెండు జట్లతో పాటు.. మరో నాలుగు జట్లు టోర్నీలో పాల్గొంటాయి. 

ఇండియా మహరాజాస్‌ జట్టు:
సౌరవ్‌ గంగూలీ(కెప్టెన్‌), వీరేంద్ర సెహ్వాగ్‌, మహ్మద్‌ కైఫ్‌, యూసఫ్‌ పఠాన్‌, బద్రీనాథ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, పార్థివ్‌ పటేల్‌(వికెట్‌ కీపర్‌), స్టువర్ట్‌ బిన్నీ,  శ్రీశాంత్‌, హర్భజన్‌ సింగ్‌, నమన్‌ ఓజా(వికెట్‌ కీపర్‌), అక్షర్ దిండా, ప్రజ్ఞాన్‌ ఓజా, అజయ్‌ జడేజా, ఆర్పీ సింగ్‌, జోగీందర్‌ శర్మ, రితేందర్‌ సింగ్‌ సోధి.

రెస్టాఫ్ వరల్డ్ టీమ్:
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), లెండిల్ సిమన్స్, డేనియల్ వెట్టోరి, జాక్వెస్ కల్లిస్, షేన్ వాట్సన్, మాట్ ప్రియర్ (వికెట్‌ కీపర్‌), నాథన్ మెకల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, హామిల్టన్ మసకద్జా, మష్రాఫ్ అష్రాఫ్, మష్రాఫ్,  మిచెల్ జాన్సన్, బ్రెట్ లీ, కెవిన్ ఓ'బ్రియన్, దినేష్ రామ్డిన్ (వికెట్‌ కీపర్‌).