
రెండో రోజు అసెంబ్లీ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ మంత్రి కేటీఆర్ ఫన్నీ కామెంట్స్ చేయడంతో సభలో నవ్వులు విరబూశాయి. అక్బరుద్దీన్ ఇంతముందులా ఇప్పుడు యువకుడివి కావు..ముసలోడివి అయ్యావు.. నీ బిడ్డ లాయర్ అయింది. అఫ్ కోర్స్ నేను కూడా ముసలోడివిని అయ్యాను.. నాకొడుకు కాలేజీలోనే చదువుతున్నాడని నవ్వుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో నవ్వులు విరబూశాయి. కానీ నిన్ను మాత్రం సిల్వర్ జూబ్లీ చేసుకోనివ్వం.. చెప్పారు. మేం చేసే అభివృద్ధితో చార్మినార్ దగ్గర మీరు ఎంజాయ్ చేస్తారు.. ఇది పక్కా.. అంటూ నవ్వుతూ చెప్పారు.