కోర్టుని ఆశ్రయించిన లియో ప్రొడ్యూసర్స్.. ఎందుకో తెలుసా?

కోర్టుని ఆశ్రయించిన లియో ప్రొడ్యూసర్స్.. ఎందుకో తెలుసా?

దళపతి విజయ్(Vijaythalapathy)  హీరోగా లోకేష్ కనగరాజ్(Lokeshkangaraj) డైరెక్షన్ లో ఆడియన్స్ ముందుకి రాబోతున్న సినిమా లియో( Leo). విజయ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ మూవీ..పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా దసరాకు థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే  రిలీజైన సాంగ్స్, టీజర్. ట్రైలర్తో భారీ హైప్ క్రియేట్ చేసింది.

లేటెస్ట్గా ఈ మూవీ బెన్ఫిట్ షోస్ విషయంలో మేకర్స్ కోర్టుకెక్కారు. ఫస్ట్ డే బెన్ఫిట్ షో చూడాలని.. విజయ్ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్..ఇలా ఏ ఇండస్ట్రీలో అయిన..బడా హీరోస్ మూవీస్ అంటే..థియేటర్స్లో ఉండే ఆ హంగామా వేరే లెవెల్.

బెన్ఫిట్ షోలు( Benefitshows) సాధారణంగా ఉదయం నాలుగు గంటలకి షో పడుతుంది. అలాగే ఫస్ట్ వీక్ అంతా ఎక్స్ ట్రా షోలకి కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ ఇస్తారనే విషయం తెలిసిందే. అయితే  విజయ్ లియో మూవీ విషయంలో మాత్రం.. తమిళనాడు స్టాలిన్ గవర్నమెంట్ ఎక్స్ ట్రా షోతో కలిపి..ఐదు షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. కానీ ఉదయం 4 గంటలకు పడే..బెన్ఫిట్ షోకి మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు.

దీంతో లియో మూవీ ఉదయం 9 గంటలకి మాత్రమే..తమిళనాడు రాష్ట్రంలో లియో ఫస్ట్ షో పడనుంది. అయితే ఇదే విషయంపై.. ప్రొడ్యూసర్ లలిత్ కుమార్, జగదీశ్ పళనిస్వామి కోర్టుని ఆశ్రయించారు. దళపతి విజయ్ ఫ్యాన్స్ కోసం వేసే మార్నింగ్ బెన్ఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ.. వీరు పిటీషన్ దాఖలు చేశారు. నేడు (మంగళవారం) ఉదయం ఈ పిటీషన్ పై కోర్టు విచారించనుంది. స్పెషల్ షోలకి పర్మిషన్ ఇవ్వాలని లియో నిర్మాతల రిక్వెస్ట్ ని కోర్టు ఎంత వరకు పరిగణంలోకి తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కోలీవుడ్  హిస్టరీలోనే హైయెస్ట్ బిజినెస్ లియో మూవీకి  జరిగింది.  హైయెస్ట్ కలెక్షన్స్ సాదిస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఇండస్ట్రీ రికార్డ్స్ కొల్లగొడుతుందని సినీ క్రిటిక్స్ భావిస్తున్నారు.

త్వరలో విజయ్ దళపతి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రచారాలు జోరందుకున్న విషయంలో.. తమిళనాడు గవర్నమెంట్ బెన్ ఫిట్ షోస్ విషయంలో..ఇలా ప్రవర్తిస్తుందని తమిళ నోటా వినిపిస్తోంది. ఇవాళ వెలువడనున్నకోర్టు తీర్పుతో క్లారిటీ రానుంది.