
ములుగు జిల్లా ఏజెన్సీ వాజేడు మండలంలో చిరుత చెట్టేక్కింది. చిటారు కొమ్మన నక్కింది. తనను ఎవరు చూడటం లేదంటూ సేద తీరుతోంది. కొంగల జలపాతం దగ్గర చెట్టుపై చిరుత కనిపించటంతో గ్రామస్తులు వణికిపోయారు. చెట్టుపై ఉన్న చిరుతను చూసిన గ్రామస్తులు వీడియో తీశారు. అయితే గ్రామస్తుల మాటలు విన్న చిరుత చెట్టు దిగి వెళ్లిపోయింది. అయితే చిరుత ఉన్న ప్రాంతం కొంగల గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో గ్రామస్తులు భయపడుతున్నారు. చిరుతని పట్టుకోవాలని ఫారెస్ట్ అధికారులను కోరుతున్నారు.