కామారెడ్డిలో చిరుత సంచారం

కామారెడ్డిలో చిరుత సంచారం

కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలోని కొట్టాల్ పల్లి గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు, స్థానికులు గుర్తించారు. గ్రామ శివారులో రెండు గేదేలపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో ఒక గేదే మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.  ఈ ఘటనతో రైతులు పొలం వద్దకు వెళ్లలంటే భయంతో వణికిపోతున్నారు. అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు గ్రామస్థులకు సూచించారు.  

మరిన్ని వార్తల కోసం..

రెండో విడత బడ్జెట్‌‌ సమావేశాల్లో టైమింగ్స్ మార్పు

నీట్‌ పీజీ కటాఫ్‌.. 15 పర్సెంటైల్‌ తగ్గింపు