V6 News

ఎలిమినేషన్స్థాయిలో కుష్టు వ్యాధి : డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రవీందర్ నాయక్

ఎలిమినేషన్స్థాయిలో కుష్టు వ్యాధి : డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రవీందర్ నాయక్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కుష్టు వ్యాధి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ వో) ప్రమాణాల ప్రకారం.. ఎలిమినేషన్ స్థాయిని సాధించిందని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి 10 వేల మంది జనాభాకు ఒక కేసు, అంతకంటే తక్కువ నమోదు కావడాన్ని ఎలిమినేషన్ అంటారన్నారు. మన రాష్ట్ర జనాభా సుమారు 4 కోట్లు ఉండగా.. ఏటా సగటున 2,600 కేసులు మాత్రమే నమోదవుతున్నాయని పేర్కొన్నారు.

దీన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు. నిరంతరం స్క్రీనింగ్ టెస్ట్​లు చేస్తూ బాధితులందరికీ మల్టీ డ్రగ్ థెరపీ(ఎండీటీ) ద్వారా ఉచితంగా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయమవుతుందని పేర్కొన్నారు.