'కట్నం వల్ల కలిగే లాభాలు' అంటూ  పాఠాలు

'కట్నం వల్ల కలిగే లాభాలు' అంటూ  పాఠాలు
  • అందంగా లేని అమ్మాయిలకు కూడా కట్నం వల్ల పెండ్లయితది!
  • నర్సింగ్ పాఠ్యపుస్తకాల్లో వివాదాస్పద అంశం

న్యూఢిల్లీ: వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం చట్టరిత్యా నేరమని ఒకవైపు ప్రచారం చేస్తుంటే.. మహారాష్ట్రలో మాత్రం విద్యార్థుల పుస్తకాల్లో 'కట్నం వల్ల కలిగే లాభాలు' అంటూ  పాఠాలు పెట్టడం సంచలనం రేపింది. నర్సింగ్ విద్యార్థులకు చెందిన సోషియాలజీ టెక్స్ట్​ బుక్ లో ఉన్న ఈ పాఠాన్ని శివసేన రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా వైరల్ గా మారింది. 'భారీ కట్నాలు ఇవ్వడం వల్ల అందంగా లేని అమ్మాయిలకు కూడా పెండ్లి అవుతుంది. కట్నాలు ఇవ్వలేని తల్లిదండ్రులు కనీసం తమ కుమార్తెలకు మంచి చదువు చెప్పించాలని భావిస్తారు' అని టీకే ఇంద్రాణి రచించిన టెక్స్ట్ బుక్ లో పేర్కొన్నారు. ప్రియాంక ఈ ట్వీట్ ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ట్యాగ్ చేశారు. ఇలాంటి పాఠాలు మన పుస్తకాల్లో ఉండటం సిగ్గు చేటని.. వెంటనే దీన్ని తొలగించాలని కేంద్ర మంత్రికి ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సిలబస్ మన రాజ్యాంగానికి పూర్తిగా విరుద్దమని ఎంపీ పేర్కొన్నారు.