ప్రకృతిని కాపాడుతూ లక్ష్యాలు సాధిద్దాం : కిషన్ రెడ్డి

ప్రకృతిని కాపాడుతూ లక్ష్యాలు సాధిద్దాం : కిషన్ రెడ్డి

న్యూయార్క్: ప్రకృతిని కాపాడు కుంటూ.. సమన్వయంతో ముందుకె ళ్లినప్పుడే అనుకున్న టైమ్​లో అభివృద్ధి లక్ష్యాలను సాధించగలమని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఇందు కోసం ఏకతాటిపైకి వచ్చి పనిచేద్దామని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. టూరి జంలో ఆర్థిక ప్రగతి, సామాజిక, పర్యావ రణ సుస్థిరత అంశంపై న్యూయార్క్​లోని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యా టక సంస్థ (యూఎన్ డబ్ల్యూటీవో) ఆధ్వ ర్యంలో జరిగిన సదస్సులో కిషన్​రెడ్డి పాల్గొన్నారు. 

శుక్రవారం రాత్రి ఐక్యరాజ్య సమితి హైలెవల్ పొలిటికల్ ఫోరం (హెచ్ఎల్పీఎఫ్) వేదికగా జరిగిన సద స్సులో మాట్లాడుతూ పర్యావరణ సుస్థి రత కోసం ఇండియా కృషి చేస్తున్నద న్నారు. టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు ఎజెండా నిర్దేశించి విజయవంతంగా లీడ్​చేశామన్నారు. గోవాలో జూన్​లో జరిగిన జీ20 సభ్యదేశాలు, ఆతిథ్య దేశాల పర్యాటక మంత్రుల సమావేశంలో ‘గోవా రోడ్ మ్యాప్’కు ఏకగ్రీవంగా ఆమోదం లభించిన విషయాన్ని గుర్తుచేశారు.