ఐక్యంగా బీజేపీ ఫాసిజాన్ని ఓడిద్దాం

ఐక్యంగా బీజేపీ ఫాసిజాన్ని ఓడిద్దాం
  •      తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక

ముషీరాబాద్,వెలుగు: దేశంలో బీజేపీ ఫాసిజాన్ని ఐక్యంగా ఓడిద్దామని తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక పిలుపునిచ్చింది.  ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వేదిక ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఫాస్టిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర సదస్సు జరిగింది. ఇందులో ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, జస్టిస్ చంద్రకుమార్, కేజీ రామచందర్, చలపతిరావు, బాల మల్లేశ్, గోవర్ధన్ హాజరై మాట్లాడారు.

 గత పదేండ్లలో ప్రధాని మోదీ నాయకత్వంలోని దేశాన్ని అస్థిరతం చేశారని విమర్శించారు. ఆర్థిక విధానాల్లో పూర్తిగా కార్పొరేట్లమయం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వంలో శాశ్వత ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్టు, క్యాజువల్ ఒప్పంద కార్మికులను ఉద్యోగులుగా నియమిస్తున్నారన్నారు. బీజేపీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలను దారి మళ్లించే కుట్ర చేస్తుందని విమర్శించారు. ఈ సదస్సులో రవి, కృష్ణ ప్రసాద్, మురారి,  గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.