కార్పొరేషన్లను గాడిలో పెడదాం: చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లతో సీఎం

కార్పొరేషన్లను గాడిలో పెడదాం: చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లతో సీఎం

రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు నియమితులైన చైర్మన్లు, వైస్ చైర్మన్లు సోమవారం సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్​రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించి పలు సూచనలు చేశారు.

కులాల వారీగా ఉన్న సొసైటీలు, కార్పొరేషన్ల ద్వారా క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టించాలన్నారు. కార్పొరేషన్లను గాడిలో పెట్టాలని, సంక్షేమ ఫలాలు అర్హులకు అందేలా చూడాలని ఆదేశించారు.

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య కార్పొరేషన్లు వారధిగా నిలవాలని, నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. నామినేటెడ్ పదవులను బాధ్యతగా తీసుకుని, నిరంతరం ప్రజల్లో ఉండాలని సూచించారు.

హైదరాబాద్, వెలుగు