ఫిన్‌‌టెక్ బిజినెస్‌‌లోకి ఎల్‌‌ఐసీ

ఫిన్‌‌టెక్ బిజినెస్‌‌లోకి ఎల్‌‌ఐసీ

న్యూఢిల్లీ: ఎల్‌‌ఐసీ ఫిన్‌‌టెక్ బిజినెస్‌‌లోకి ఎంటర్ అవ్వాలని చూస్తోంది. పెరుగుతున్న డిజిటల్ అవసరాలను తీర్చేందుకు సరికొత్త సబ్సిడరీని ఏర్పాటు చేయనుంది. సొంతంగా దీనిని అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఎల్ఐసీ సీఈఓ ఆర్. దొరైస్వామి తెలిపారు. మార్కెట్ పోటీని తట్టుకునేలా ఐటీ సొల్యూషన్లను మెరుగుపరచడం, ఇన్నోవేషన్లపై ఫోకస్ పెట్టడం  దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు.  

ప్రభుత్వం తన వాటాను మరింత ఉపసంహరించుకునే విషయమై స్పందిస్తూ.. ఎల్ఐసీ మొదటి నుంచి ఇందుకు సిద్ధంగానే ఉందని, సరైన సమయం కోసం ప్రభుత్వం వేచి చూస్తోందని ఆయన పేర్కొన్నారు. కాగా, 2025-–26 మార్చి క్వార్టర్‌‌‌‌లో ఎల్ఐసీ నికర లాభం 23శాతం వృద్ధితో రూ.23,420 కోట్లుగా నమోదైంది.