న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ సెక్టార్‌లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్ (క్యూ4) లో రూ.23,420 కోట్ల నికర లాభాన్ని గడించి అత్యధిక లాభాలు ఆర్జించిన సంస్థగా నిలిచింది.
గతేడాది ఇదే కాలం వచ్చిన రూ.19,013 కోట్ల ప్రాఫిట్‌తో పోలిస్తే ఇది 23 శాతం ఎక్కువ. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా క్యూ4లో ఎల్‌ఐసీ మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. ఫైనాన్షియల్ సెక్టార్‌లో ఎల్‌ఐసీ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రూ.19,684 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.19,221 కోట్ల లాభాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
అయితే, వార్షిక లాభాల పరంగా చూస్తే ఎస్‌బీఐ 2025–26 లో రూ.80,032 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (రూ.74,670 కోట్లు), ఎల్‌ఐసీ (రూ.57,419 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ వార్షిక లాభం రూ.50,147 కోట్లుగా నమోదైంది. క్యూ4లో ఎల్‌ఐసీ ఏయూఎం 5 శాతం పెరిగి రూ.57,29,396 కోట్లకు చేరింది. ఇతర ప్రభుత్వ కంపెనీల్లో ఐఓసీ (రూ.11,378 కోట్లు), కోల్ ఇండియా (రూ.10,839 కోట్లు), ఎన్‌టీపీసీ (రూ.8,747 కోట్లు), పీఎఫ్‌సీ (రూ.8,598 కోట్లు) ఎక్కువ లాభాలను సాధించాయి.
