సింగపూర్‌లో లైఫ్ పై టెక్కీ వైరల్ పోస్ట్.. సూట్ వేసుకున్న బడాబాబులూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లోనే

సింగపూర్‌లో లైఫ్ పై టెక్కీ వైరల్ పోస్ట్.. సూట్ వేసుకున్న బడాబాబులూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లోనే

ప్రపంచంలోని చాలా దేశాలతో పోల్చితే ఇండియాలో లైఫ్ సూపర్ ఉంటుందని మనం అనుకుంటుంటాం. కానీ ఇక్కడి కంటే సింగపూర్ లాంటి దేశాల్లో జీవితం ఎంత సులువుగా ఉంటుందో అనే విషయాన్ని ఒక ఇండియన్ టెక్కీ వెల్లడించారు. అతని అనుభవాలను పంచుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మాడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఇండియా నుంచి సింగపూర్‌కు వలస వెళ్లిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమన్ తన అనుభవాలను వివరిస్తూ చేసిన వీడియో ఒకటి హాట్ టాపిక్‌గా మారింది. భారత్‌తో పోలిస్తే సింగపూర్‌లో లివింగ్ ఎలా భిన్నంగా ఉంటుందో వివరిస్తూ పంచుకున్న నాలుగు కల్చరల్ షాక్స్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి. కొన్నిసార్లు ప్లేస్ మారితే ఆలోచనా విధానం కూడా పూర్తిగా మారిపోతుందంటున్నారు అమన్.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aman♠️ (@amandailylogs)

అమన్ వివరించిన మొదటి మార్పు సంపద గురించే. ఇండియాలో కారు ఉండటాన్ని ఒక హోదాగా భావిస్తాం. కానీ సింగపూర్‌లో కార్ల ధరలు భారత్ కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ. అక్కడ కారు కొనాలంటే ప్రభుత్వం నుంచి 'సర్టిఫికేట్ ఆఫ్ ఎంటైటిల్మెంట్' పొందాలి. ఇది చాలా ఖరీదైన వ్యవహారం. అందుకే అక్కడ ఖరీదైన సూట్లు ధరించిన వారు కూడా మెట్రో రైళ్లలో ప్రయాణించడం సర్వసాధారణం అని చెప్పారు అమన్. అక్కడ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అనేది పేద, ధనిక అనే తేడా లేని ఒక గొప్ప ఈక్వలైజర్ అని అన్నారు.

రెండవ అంశం ఫుడ్ కల్చర్. ఇండియాలో బయట తినడం అనేది ఒక లగ్జరీ చూస్తుంటారు. కానీ సింగపూర్‌లో అది ఒక అవసరం అంటున్నారు అమన్. అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు, వంట చేయడానికి పట్టే సమయం కంటే కమ్యూనిటీ ఫుడ్ కోర్టుల్లో తినడం చాలా చౌక అని వెల్లడించారు వీడియోలో. ఇండియా నుంచి వెళ్లిన వారు ఈ మార్పును జీర్ణించుకోవడానికి కొంత సమయం పడుతుందని అంటున్నారు అమన్.

మూడవది డిజిటల్ సేవలు. సింగపూర్‌లో 'Singpass' అనే యాప్ అక్కడి ప్రజల జీవితాలను ఎంతగా మార్చేసిందో అమన్ వివరించారు. టాక్సుల దగ్గర నుంచి.. బ్యాంకింగ్, హెల్త్, హౌసింగ్.. ఇలా ప్రతిదానికి ఒకే ఒక యాప్ సరిపోతుందన్నారు. ఆ వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఉంటుందంటే.. తాను జిరాక్స్ మెషీన్‌ను చూసి కూడా చాలా కాలమైందని, అసలు దాని అవసరం కూడా రాదని చెప్పారు. 

చివరిగా సోషల్ ప్రైవసీ. ఇండియాలో ఇరుగుపొరుగు వారు ఇచ్చే సలహాలు, అనవసరమైన పలకరింపులు అక్కడ ఉండవన్నారు అమన్. ఎవరి పని వారు చేసుకుంటారని.. మొదట్లో ఇది కొంత ఒంటరితనంగా అనిపించినా, ప్రైవసీని కోరుకునే వారికి ఇది ఒక గొప్ప విలాసంగా మారుతుందని అమన్ అన్నారు. సింగపూర్ జీవనశైలి ఖరీదైనదే అయినప్పటికీ.. అక్కడ లభించే సౌకర్యాలు ఒక 'బగ్-ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్'లా సాఫీగా సాగుతాయని తాను చూసిన దాని గురించి అభిప్రాయపడ్డారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు స్పందిస్తూ.. విదేశాల్లో ఉండే భారతీయుల మనోభావాలను అమన్ అద్భుతంగా వెల్లడించారని కామెంట్స్ చేస్తున్నారు.