జలపాతంలో చిక్కుకున్నవారికి లైఫ్ సేవింగ్స్ ట్యూబ్స్ ఎంతో ఉపయోగం

జలపాతంలో చిక్కుకున్నవారికి లైఫ్ సేవింగ్స్ ట్యూబ్స్ ఎంతో ఉపయోగం

ప్రమాదవశాత్తు జలపాతంలో చిక్కుకున్న వారికి లైఫ్ సేవింగ్స్ ట్యూబ్స్ ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు ఆ సంస్థ నిర్వాహకులు. శనివారం కుంటాల జలపాతం దగ్గర ఏఏఆర్ ఫౌండేషన్, నిర్మాణ్ వెల్ఫేర్, సోనాల సొసైటీల ఆధ్యర్యంలో అటవీశాఖ అధికారులకు లైఫ్ సేవింగ్స్ ట్యూబ్స్ ను అందజేశారు సంస్థల ప్రతినిధులు. ప్రతి సంవత్సరం పలు ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు జలపాతంలో ప్రమాదానికి గురై ప్రాణాలను కోల్పోతున్నారని.. ఈ ట్యూబ్స్  ప్రమాదంలో చిక్కుకొన్న వారికి దగ్గరలో వేసినట్లయితే వారు ప్రమాదం నుండి బయటపడే అవకాశం ఉందన్నారు.

ఈ ట్యూబ్స్ ద్వారా ఒక ప్రాణమైనా కాపాడిన సంతోషమే అనే ఉద్దేశ్యంతో లైఫ్ సేవింగ్స్ ట్యూబ్స్ పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అడ్డి అవినాష్ రెడ్డి(AAR ఫౌండేషన్ అధ్యక్షులు), కొస్మెట్ శుద్ధోధన్ (నవ నిర్మాణ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు), అడ్డి అన్వేష్ రెడ్డి,బాషెట్టి రాజ్కుమార్(ప్రధాన కార్యదర్శి),నర్సయ్య(ఇకో కమిటీ చైర్మన్), రాధాకృష్ణ(FBO),సోమన్న (టూరిజం గైడ్), గజ ఈతగాళ్లు, తదితరులు పాల్గొన్నారు.