
- బైక్‌ను ఢీకొట్టిన బస్సు.. ముగ్గురు మృతి
- అంత్యక్రియలకు వెళ్తుండగా యాక్సిడెంట్
- నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఘటన
మక్తల్, వెలుగు: బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురు యువకులు చనిపోయారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మక్తల్‌లో మంగళవారం చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కర్నాటక స్టేట్‌కు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్తున్నది. నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి రాఘవేంద్ర చారి అలియాస్ రఘు, మున్నూరు వెంకటేశ్, మహేశ్ ఒకే బైక్‌పై ధన్వాడ మండలం పూసల్‌పాడ్‌కు వెళ్తున్నారు. వీరి ఫ్రెండ్ అయిన రవి తల్లి చనిపోవడంతో అంత్యక్రియలకు బయల్దేరారు.
మక్తల్ సమీపంలోని దండు క్రాసింగ్ దగ్గరకు రాగానే కర్నాటకకు చెందిన ఆర్టీసీ బస్సు వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో రఘు (26), వెంకటేశ్ (23) స్పాట్లోనే చనిపోయారు. మహేశ్ (18) తీవ్రంగా గాయపడగా.. మక్తల్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. తర్వాత అక్కడి నుంచి మహబూబ్‌నగర్ జిల్లా హాస్పిటల్లకు తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. రఘుకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ ముగ్గురు ఫొటో, వీడియో గ్రాఫర్‌గా పని చేసేవాళ్లు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ భాగ్యలక్ష్మి తెలిపారు. యాక్సిడెంట్‌కు కారణమైన బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించారు.