కెనరా బ్యాంక్ మేనేజర్, సిబ్బంది సస్పెన్షన్

కెనరా బ్యాంక్ మేనేజర్, సిబ్బంది సస్పెన్షన్

మంగపేట, వెలుగు: గోల్డ్​ మాయం అయిన ఘటనలో ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట కెనరా బ్యాంక్  బ్రాంచ్  మేనేజర్, సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండ్  చేశారు. సోమవారం వరంగల్  రీజినల్​ డిప్యూటీ జనరల్  మేనేజర్  శ్రీనివాసరావు, అసిస్టెంట్  జనరల్ మేనేజర్  మాధవి, లీగల్  అడ్వైజర్ తో కలిసి రాజుపేట కెనరా బ్యాంక్  మేనేజర్​ కిరణ్ కుమార్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్రైజర్  సమ్మెట ప్రశాంత్  గోల్డ్ కాజేసి రోల్డ్  గోల్డ్  పెట్టిన వ్యవహారంలో నిర్లక్షంగా వ్యవహరించినట్లు గుర్తించారు. బ్యాంక్  మేనేజర్  కిరణ్ కుమార్ తో పాటు మరో ముగ్గురు ఆఫీసర్లను కెనరా  బ్యాంక్  వరంగల్  రీజినల్​ డీజీఎం సస్పెండ్​ చేశారు.