ఏపీ ఎన్నికల ఫలితాలపై రఘువీరా జోస్యం..

ఏపీ ఎన్నికల ఫలితాలపై రఘువీరా జోస్యం..

ఏపీలో 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఇప్పుడు జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాల కోసం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గెలుపు తమదే అంటూ అధికార ప్రతిపక్షాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కూటమి గెలిస్తే చంద్రబాబు అమరావతిలో ప్రమాణస్వీకారం చేస్తారని టీడీపీ శ్రేణులు అంటుండగా, వైసీపీ శ్రేణులు మరో ముందడుగేసి ప్లేస్ తో సహా డేట్ టైం కూడా ఫిక్స్ చేశారు. జగన్ 9వ తేదీ సీఎంగా వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ప్రమాణం చేయనున్నారంటూ ప్రచారం చేస్తున్నారు.

అయితే, మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరగటంతో ఫలితం కూడా ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో చాలా క్లోజ్ ఫైట్ ఉంటుందని అన్నారు. ఏ పార్టీ వేవ్ ఉండబోదని అన్నారు. అధికార వైసీపీ, లేదా కూటమిలో ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా 95 నుండి 97 సీట్లతో మాత్రమే అధికారంలోకి వస్తారని అన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు చాలా ప్రభావం చూపిందని అన్నారు. డబ్బు ప్రభావం లేని రెండు మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అన్నారు రఘువీరా.