సొంత తమ్ముడిలా…సింహంతో సావాసం

సొంత తమ్ముడిలా…సింహంతో సావాసం

సింహాన్ని చూడాలనిపించిందనుకోండి.. జూలోదూరం నుంచి చూడొచ్చు! ఫొటో దిగాలనిపిం చిందనుకోండి.. కొంచెం రిస్క్​ అయినా ఫర్వాలేదు దూరం నుంచి ట్రై చేయొచ్చు! కానీ, చనువిచ్చింది కదా అని దాని జూలుకు హెయిర్ స్టైల్​ చేయాలని ట్రై చేస్తే.. ఏమవుతుంది! పంజాతో చీల్చిచెండాడుతుంది కదా! కానీ, ఇద్దరు అన్నదమ్ములేందో దానితోనే సహవాసం చేస్తున్నారు. దానితో కలిసి తిరుగుతున్నారు. ఆట, పాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. కార్లో టూర్లకు తీసుకెళుతున్నారు. పాకిస్థాన్​లోని కరాచీకి  చెందిన ఆ ఇద్దరు అన్నదమ్ముల పేర్లు హమ్జా హుస్సేన్​, హసన్​ హుస్సేన్​. దానికి రెండు వారాలున్నప్పటి నుం చి ఆ సింహాన్ని పెంచు కుంటున్నారట వాళ్లు. రెస్టారెంట్​తో బతుకు బండిని లాక్కొస్తున్న ఆ బ్రదర్స్​.. దానిని ముద్దు గా ‘సింబా’అని పిలుచుకుంటున్నారు. తమ పొలంలోనే అది పుట్టిం దని, దానిని తల్లి సింహం పట్టించుకో కపోవడంతో తామే దత్తత తీసుకు ని పెంచు కుంటున్నామని వాళ్లు చెబుతున్నారు. సొంత తమ్ముడిలాగే 26 నెలల సింబాను చూసుకుంటున్నామని హసన్​ చెప్పాడు. వాకిం గ్ కు తమతో పాటు తీసుకెళతామని, కార్లో ఊరంతా తిప్పుతామని చెప్పాడు. పొరపాటున కొత్తవాళ్లుగానీ సింబాను చూసి అరిచినా,పరుగెత్తినా కరిచేస్తాడని అన్నాడు. రోజూ ఐదు కిలోల బీఫ్ మాం సం సింబా తిం టాడట. కొన్నిసార్లు మేక మాం సమూ భోజనంగా పెడతారట. అయితే, చికెన్​ను మాత్రం చచ్చినా ముట్టడని అంటున్నారు.ఇప్పుడు సింబా జోడీ కోసం ఈ అన్నదమ్ములు వెతుకుతు న్నారట. ఒకవేళ సరైన జోడీ దొరకకపోతే దక్షిణాఫ్రికా నుం చి తెప్పించు కుంటామని హసన్​ చెప్పాడు. చుట్టుపక్కలోళ్లు సింబాతో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలిపాడు.