శంషాబాద్​లో 34.78 కిలోల బంగారం పట్టివేత

శంషాబాద్​లో 34.78 కిలోల బంగారం పట్టివేత

శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్​పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 34.78 కిలోల బంగారు నగలు, 43.60  కిలోల వెండిని ఎన్నికల అధికారులు, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్  పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఎన్నికల తనిఖీల్లో భాగంగా సైబరాబాద్ ఎస్ఓటీ, శంషాబాద్ పోలీసులు కలిసి వాహనాలు చెక్  చేస్తున్నారు.

 ఈ క్రమంలో రెండు వాహనాలను తనిఖీలు చేయగా సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న 34.78 కిలోల బంగారు నగలు, 43.60 కిలోల వెండి దొరికింది. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని శంషాబాద్  ఎయిర్ పోర్ట్  పోలీస్ స్టేషన్ కు తరలించారు. విచారణలో భాగంగా బంగారాన్ని వెంటనే ఎఫ్ఎస్ టీ టీంకు అప్పగించారు. బంగారం, వెండి విలువ రూ.23 కోట్లు ఉండవచ్చని అంచనా వేశారు. విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.