దేశంలో బీజేపీ పట్టు కోల్పోయింది: శశి థరూర్‌‌‌‌

దేశంలో బీజేపీ పట్టు కోల్పోయింది: శశి థరూర్‌‌‌‌

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాయని కాంగ్రెస్‌‌‌‌ సీనియర్‌‌‌‌ నేత శశిథరూర్‌‌‌‌ అన్నారు. దేశ ప్రజలందరినీ సమానంగా చూస్తూ, ఎదుటివారి మాటకు విలువనిచ్చే వ్యక్తే 'ఇండియా' కూటమి ద్వారా ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాని అవుతారని వెల్లడించారు. ఒక పార్టీతో ఏర్పడిన ప్రభుత్వాలతో పోలిస్తే కూటమితో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాల హయాంలోనే భారత ఆర్థిక వ్యవస్థ మెరుగయ్యిందని గుర్తుచేశారు. శనివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

"ఇవి మార్పు కోసం జరుగుతున్న ఎన్నికలు. ఇప్పటికే దేశంలో బీజేపీ తన పట్టును కోల్పోయింది. ఇండియా కూటమితో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధానిగా ఎవరు ఎన్నికైనా నిరంకుశ పోకడలు ఉండవు. స్పష్టంగా చెప్పాలంటే ఇది పార్లమెంటరీ పాలనా వ్యవస్థకు చెందిన అద్భుతమైన రాజకీయ సూత్రం. సంకీర్ణ ప్రభుత్వంతో ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు" అని శశి థరూర్‌‌‌‌ పేర్కొన్నారు.