లైక్ షేర్ సబ్ స్క్రైబ్ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్

లైక్ షేర్ సబ్ స్క్రైబ్ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్

డైరెక్టర్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో  సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న మూవీ ‘లైక్ ..షేర్ అండ్ సబ్ స్క్రైబ్‘. నిహారిక బ్యానర్ పై వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను ఇవాళ రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. దర్శకుడు మేర్లపాక గాంధీ కాన్ ఫ్లిక్ట్ ని రివిల్ చేయకుండానే చాలా చాకచక్యంగా క్యూరియాసిటీని పెంచుతూ ట్రైలర్‌ను కట్‌ చేశాడు. సంతోష్ శోభన్ ట్రావెల్ బ్లాగర్ గా తన యూట్యూబ్ ఛానెల్ కోసం కొత్త వీడియోని షూట్ చేయడానికి వెళ్ళిన ట్రిప్ లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లాని కలవడం, ప్రేమలో పడటం చాలా క్రేజీగా ప్రజంట్ చేశారు. కథాంశం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఈ సినిమా నవంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. టీజర్, పాటలు సినిమా అంచనాలను పెంచాయి. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు.

లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్' ఫుల్ ఫన్ మూవీ అని డైరెక్టర్  మేర్లపాక గాంధీ అన్నారు.  నాన్ స్టాప్ నవ్వులు ఉంటాయన్నారు.  ‘సంతోష్ శోభన్ తో ఎక్ మినీ కథ చేశాం.. తను మంచి యాక్టర్.  'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్' పాత్రని పెర్ఫెక్ట్ గా చేశాడు. జాతిరత్నాలు తర్వాత ఫరియా అబ్దుల్లా ఈ సినిమా చేయడం ఆనందంగా వుంది. బ్రహ్మజీ, సుదర్శన్ , మైమ్ గోపి, చాలా మంచి నటీనటులు ఇందులో ఉన్నారు. నవంబర్ 4న సినిమా విడుదలవుతుంది. మీ అందరినీ అలరిస్తుంది'' అని అన్నారు.