ట్రంప్‌‌లాగే మమతా బెనర్జీది నియంతృత్వ మనస్తత్వం

ట్రంప్‌‌లాగే మమతా బెనర్జీది నియంతృత్వ మనస్తత్వం

కోల్‌‌కతా: బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విమర్శలకు దిగారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌‌లాగే మమతాది కూడా నియంతృత్వ మనస్తత్వమని దిలీప్ కామెంట్ చేశారు. ‘దీదీది కూడా ట్రంప్ లాంటి మనస్తత్వమే. ప్రజాస్వామ్యంపై వీరికి పెద్దగా నమ్మకం ఉండదు. ట్రంప్ ఓటమి తర్వాత అమెరికా ఎలా ఉందో వెస్ట్ బెంగాల్‌‌లో కూడా అలాంటి పరిస్థితులే నెలకొనే ప్రమాదం ఉంది. మమత ఓటమి తర్వాత అధికార భవనాన్ని వదలరని కచ్చితంగా చెప్పొచ్చు. గతంలోనూ ఓసారి అసెంబ్లీలో దాడులు చేయడం, చెయిర్స్ విరగ్గొట్టి వాటికి ఫైన్ కట్టిన హిస్టరీ ఆమెది. ఏ విషయం పై అయినా రాజకీయం చేయడం మమతాకు అలవాటే. కేంద్ర పథకాలను కూడా పేరు మార్చి క్రెడిట్ కొట్టేయడం ఆమెకే చెల్లింది. వ్యాక్సినేషన్‌‌కు సరిపడా బడ్జెట్ లేకున్నా దీదీ అనవసర కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి విషయాలు నచ్చకే తృణమూల్‌‌ను అందరూ వీడుతున్నారు’ అని దిలీప్ ఘోష్ పేర్కొన్నారు. ఈ ఏడాది బెంగాల్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు నేతలు చేరికలు, ఇతర నాయకులపై విమర్శలకు పదును పెట్టాయి.