హైదరాబాద్ సిటీ, వెలుగు: మాదాపూర్, బోరబండ సరిహద్దుల్లోని సున్నంచెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తున్న ఆంజనేయస్వామి గుడి, ముస్లింల చిల్లా (ప్రార్థనా స్థలం)ను చెరువు గట్టు వైపు తరలించేందుకు అంగీకారం కుదిరింది. శనివారం ఆ పరిసర ప్రాంత ప్రజలతో హైడ్రా సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో ఇరువర్గాలు తరలింపునకు సానుకూలంగా స్పందించినట్లు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. దీంతో ఈ సమస్యకు తెరపడింది.
