స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‎కు లైన్ క్లియర్: స్టే ఇవ్వటానికి నిరాకరించిన హైకోర్టు

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‎కు లైన్ క్లియర్: స్టే ఇవ్వటానికి నిరాకరించిన హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. విచారణను అక్టోబర్ 9వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. ఈ క్రమంలోనే నోటిఫికేషన్‎ విడుదలకు సంబంధించి స్టే ఇవ్వలేం అని.. నోటిఫికేషన్ యథావిధిగా ఇచ్చుకోవచ్చు అని హైకోర్టు స్పష్టం చేసింది.

దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 9వ తేదీన స్థానిక సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ జీవోను వ్యతిరేకిస్తూ.. నోటిఫికేషన్ ఇవ్వొద్దు అంటూ పిటీషన్ల తరపు లాయర్లు హైకోర్టును కోరారు. వారి వాదనను తోసిపుచ్చిన హైకోర్టు.. నోటిఫికేషన్‎తో సంబంధం లేదని.. నోటిఫికేషన్‎పై స్టే ఇవ్వలేం అని స్పష్టం చేసింది.