టెక్నాలజీ..లింక్ హిస్టరీ.. నెల రోజుల వరకు

 టెక్నాలజీ..లింక్ హిస్టరీ.. నెల రోజుల వరకు

ఫేస్​బుక్ లింక్ హిస్టరీ అనే కొత్త ఫీచర్​ని తెచ్చింది. లింక్ హిస్టరీ అనేది మొబైల్​లోని ఫేస్​బుక్ యాప్​లో ఒక ఫీచర్. ఇది యాప్​లో క్లిక్ చేసిన లింక్స్​ను ట్రాక్ చేసి చూపిస్తుంది. ఇందులో పోస్ట్, కామెంట్, మెసేజ్​లు ఉంటాయి. ఫేస్​బుక్​ ఈ డాటాను30 రోజుల పాటు స్టోర్ చేసి ఉంచుతుంది. డిలీట్​ చేస్తే తప్ప అవి పోవు. ఈ ఫీచర్ ద్వారా ముప్పై రోజుల ఫేస్​బుక్​ హిస్టరీ చూడొచ్చు. 

అదెలాగంటే..

ఫేస్​బుక్​లో లింక్​ మీద క్లిక్​ చేస్తే... దేని మీద క్లిక్ చేశారో ఆ యూఆర్​ఎల్​, ఎప్పుడు క్లిక్ చేశారో ఆ టైం రికార్డ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ లింక్​ హిస్టరీ కింద స్టోర్​ అవుతుంది. లింక్ హిస్టరీ థర్డ్ పార్టీ కంపెనీలకు షేర్ కాదని కంపెనీ చెప్పింది. ఇది కేవలం ఆప్షనల్ ఫీచర్​. కాబట్టి దీన్ని ఎప్పుడైనా సరే ఫేస్​బుక్ యాప్​ సెట్టింగ్స్​లో ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. యూజర్లు లింక్​ హిస్టరీ డాటాని ఎప్పుడైనా డిలీట్ చేయొచ్చు. 

ఇలా చేయాలి

ఫేస్​బుక్​ యాప్​లో ఉన్న ఏదైనా లింక్​ని ఓపెన్ చేయాలి. కింద కుడివైపు ఉన్న మూడు చుక్కల్ని ట్యాప్ చేసి, బ్రౌజర్ సెట్టింగ్స్ సెలక్ట్ చేయాలి. సెట్టింగ్స్ ఆన్​ లేదా ఆఫ్ చేయడానికి టోగుల్​ మీద ట్యాప్ చేయాలి.