ఆ రోజు మందు షాపులు బంద్

ఆ రోజు మందు షాపులు బంద్

 మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ను తెలియజేసింది. ఏప్రిల్  6వ తేదీన  హైదరాబాద్లో వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఎందుకంటే ఆ రోజు హనుమాన్ జయంతి కాబట్టి.  ఈ మేరకు  హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వైన్ షాపులు, బార్లు, పబ్‌లు ఏప్రిల్ 6వ తేదీన బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఎప్పటి నుంచి ఎప్పటి వరకు.. 

ఏప్రిల్ 6వ తేదీన  హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరమంతా భారీ ర్యాలీలు జరుగుతాయి. ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు.. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తారు. అయితే  ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైన్ షాపులు, బార్లు, పబ్ లు  మూసేయాలని పోలీసులు ఆదేశించారు. ఈనెల 6న ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. 

కఠిన చర్యలు..

హనుమాన్ జయంతి సందర్భంగా ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటుచేసుకోకుండా  ఉండేందుకే మద్యం దుకాణాలను బంద్ చేయమని ఆదేశాలు జారీ చేసినట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు.  నిబంధనలను ఉల్లంఘించి మద్యం దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. బ్లాక్లో మద్యం అమ్మినా..కేసులు నమోదు చేస్తామన్నారు.