యూఎస్ నేవీకి తొలి మహిళా అధిపతిగా లీసా ఫ్రాంచెటీ

యూఎస్ నేవీకి తొలి మహిళా అధిపతిగా లీసా ఫ్రాంచెటీ

అగ్రరాజ్యం అమెరికా మహిళా ఆఫీసర్​ అడ్మిరల్​ లీసా ఫ్రాంచెటీని అమెరికా నేవీ హెడ్​గా (నౌకాదళాధిపతి)ఎంపిక చేస్తూ.. అధ్యక్షుడు జో బైడెన్​ నిర్ణయం తీసుకున్నారు.  సెనేట్ అంగీకరిస్తే.. అమెరికా మిలటరీ సర్వీస్​ చీఫ్ గా ఓ మహిళ నియమితులు కావడం ఇదే అమెరికా చరిత్రలో అదే తొలి సారి అవుతుంది. 

జాయింట్ చీఫ్స్​ ఆఫ్ చీఫ్​ హోదాకు చేరిన తొలి మహిళగా కూడా ఆమె గుర్తింపు పొందుతారు.  ఆమె కెరీర్ మొత్తంలో, అడ్మిరల్ ఫ్రాంచెట్టి కార్యాచరణ, విధాన రంగాలలో విస్తృతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. యునైటెడ్ స్టేట్స్ నేవీలో ఫోర్-స్టార్ అడ్మిరల్ ర్యాంక్ సాధించిన రెండో మహిళ  నేవల్ ఆపరేషన్స్ చీఫ్‌, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌లో పనిచేసిన తొలి మహిళగా ఆమె మళ్లీ చరిత్ర సృష్టించనుంది.