బస్సుపై గుర్రం బొమ్మ చూసి పరుగెత్తిన మరో గుర్రం

బస్సుపై గుర్రం బొమ్మ చూసి పరుగెత్తిన మరో గుర్రం

కోయంబత్తూరులో బస్సు వెనుక గుర్రం పరిగెత్తిన వీడియో వైరల్ గా మారింది. బస్సుపై హార్స్ స్టికర్ చూసిన మరో గుర్రం బస్సు వెనుకే పరిగెత్తింది. కోయంబత్తూరు జిల్లా పేరురు పట్టీ స్వరార్ ఆలయం దగ్గర గుర్రాలు రోజూ తిరుగుతూ ఉంటాయి. వారం రోజుల క్రితం తల్లి నుంచి విడిపోయిన ఓ గుర్రం తన తల్లిని వెతుక్కుంటూ తిరుగుతోంది. పేరూర్ బస్టాండ్ నుంచి గాంధీపురం వెళ్తున్న ప్రైవేటు బస్సుపై గుర్రం స్టికర్ ఉంది. దాన్ని చూసి బస్సు చుట్టే తిరిగింది గుర్రం. బస్సుని వెళ్లనివ్వకుండా దాని చుట్టూ తిరుగుతూనే ఉంది. కొద్ది సేపటి తర్వాత బస్సు బయల్దేరి వెళ్లేసరికి ఆ బస్సును వెంబడించింది గుర్రం. ఈ వీడియోను సోషల్ మీడియోలో పోస్టు చేయడంతో  దీనికి నెటిజన్ల నుంచి భారీగా లైకులు, కామెంట్లు వస్తున్నాయి. తల్లిప్రేమకు తల్లడిల్లుతున్నఈ గుర్రాని చూస్తే ఎవరికైనా మనసు కరిగిపోతుంది.