చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలి.. మన్సురాబాద్ లో గాంధీ విగ్రహానికి వినతిపత్రం

చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలి..  మన్సురాబాద్ లో గాంధీ విగ్రహానికి వినతిపత్రం

ఎల్బీనగర్, వెలుగు: రాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్​ చేశారు. మంగళవారం సంఘం ఆధ్వర్యంలో మన్సురాబాద్ లో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలన్నారు. బడ్జెట్​లో రూ.2 వేల కోట్లు కేటాయించాలని కోరారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు చెరుకుస్వామి, మూషం నరహరి, వర్కాల
 చంద్రశేఖర్ పాల్గొన్నారు.