నిద్ర, ఆహారం మనిషిని చాలా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా నిద్ర లేమితో అనేక ఆరోగ్య సమస్యలొస్తాయి. అంతేకాదు దీనివల్ల మగవాళ్లకు ..ఆడవాళ్ల లక్షణాలు వస్తాయని అంటున్నారు. వైద్యులు. ఆధునిక జీవన శైలితో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, పోర్నోగ్రఫీ ప్రభావంతో యువతలో 'హోమో సెక్స్' ప్రవర్తన కూడా పెరుగుతోంది అంటున్నారు. ఇది ఇలా కొనసాగితే మెట్రో నగరాల్లో జంబలకడిపంబ సినిమాలోని సీన్లు రియల్ లైఫ్ లో కూడా కనిపిస్తాయేమో!
యంత్రం లాంటి మనిషి శరీరానికి నిద్ర చాలా అవసరం. జీవగడియారం ప్రకారం ఏటైంకి చేయాల్సిన పనులు ఆ టైంలో చేయాలి. లేదంటే అనేక సమస్యలు ఎదురవుతాయి. రాత్రంతా మేల్కొని, పొద్దంతా పడుకున్నా హార్మోన్ల విడుదలలో తేడా వస్తుందంటున్నారు వైద్యులు. ముఖ్యంగా మగవాళ్లలో రాత్రి పూట టెస్టోస్టెరాన్ లాంటి 'లైంగిక' హార్మోన్లు విడుదలవుతాయి.రాత్రి పూట 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు మేల్కొని ఉంటే, టెస్టోస్టిరాన్ ఉత్పత్తి తగ్గిపోయే ముప్పు ఉంటుంది. అదే సమయంలో మగవాళ్ల శరీరంలో ఉండే ఆడవాళ్లకు సంబంధించిన ఈస్ట్రడయాల్ (ఈ 2) హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. దీంతో తెలియకుండానే మగవాళ్లలో అడవాళ్ల లక్షణాలు వస్తాయి. ప్రవర్తన కూడా మారే ప్రమాదం ఉంది అంటున్నారు నిపుణులు. అయితే, అతికొద్ది మందిలో మాత్రమే ఇలా జరుగుతుందని ఆండ్రాలజిస్ట్ నిపుణులు చెప్తున్నారు.
ఆల్కాహాల్ అధికంగా తీసుకోవడం, పనిఒత్తిడి, శారీరక శ్రమ తగ్గిపోవడం, స్మార్ట్ ఫోన్ల రేడియేషన్, జంక్ ఫుడ్, విటమిన్-డి లోపం, కాలుష్యం.. హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని ఆయన తెలిపారు. ఇవే కారణాల వల్ల ఆడవాళ్లలో నూ మేల్ హార్మోన్లు పెరుగుతున్నాయని, పీసీఓడి, అవాంఛిత రోమాలు వస్తుండడం ఈ హార్మోన్ల అసమతుల్యత వల్లేనని గైనకాలజిస్ట్ లు చెబుతున్నారు.
ఆలోచనలో మార్పు
అధిక శాతం మగవాళ్లు టెస్టోస్టిరాన్ హార్మోన్ కేవలం శృంగారం కోసమే ఉపయోగపడుతుంది అనుకుంటారు. కానీ, శరీరంలోని అనేక అవయవాలపై టెస్టోస్టిరాన్ ప్రభావం ఉంటుందని ఆండ్రాలజిస్ట్ నిపుణులు అంటున్నారు.
'మారుతున్న జీవనశైలి వల దశాబ్ద కాలంగా హార్మోన అసమతుల్యత పెరుగుతూ వస్తోంది. టెస్టోస్టిరాన్ తగ్గితే బ్రెస్ట్ సైజ్ ఉండాల్సిన దానికంటే ఎక్కువవుతుంది. ఇలా మగవాళ్లలో బ్రెస్ట్ పెరగడా న్ని గైనకోమాస్టియా అంటారు. మరోవైపు టెస్టోస్టిరాన్ లోపంతో మెదడుపై ప్రభావం పడి, ఆలోచనల తీరు మారుతుంది. ప్రవర్తనలో తేడా వస్తుంది. శుక్రకణాల ఉత్పత్తితోపా టు గుండె సరిగ్గా పనిచేయడానికి, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండడానికి ఆలోచన విధానంసరైన రీతిలో ఉండడానికి, మెంటల్ హెల్త్ సక్రమంగా ఉండడానికి కూడా టెస్టోస్టిరాన్ అవసరం .
టెస్టోస్టిరాన్ తగ్గిపోయినవాళ్లలో ఒబేసిటి పెరుగుతుంది. కండరాల శక్తి, చురుకుదనం తగ్గిపోతుంది. ఎముకలు వీక్ అవుతాయి. టెస్టోస్టిరాన్ సమస్య దీర్ఘకాలం కొనసాగితే చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చే ప్రమాదముంది. లైంగిక ఇబ్బందులు, సంతానలేమి సమస్య పెరగడంలో టెస్టోస్టిరాన్ లోపమే ప్రధాన కారణమంటున్నారు వైద్య నిపుణులు.
టెస్టోస్టిరాన్ లోపాన్ని వ్యాయామం, సరైన ఆహార నియమాలతో అధిగమించవచ్చు. ఎక్సర్ సైజ్ తో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి సమపాళ్లలో ఉంటుందని, కనీసం వారానికి ఒకసారైనా వ్యాయామం చేస్తూ, పోషకాహా రం తీసుకోవాలి.
తగ్గుతున్న శుక్రకణాల ఉత్పత్తి
గతంలో ఆడవాళ్లలోనే సంతానలేమి...సెక్స్ పై ఆసక్తి తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం సమస్యలు ఎక్కువగా కనిపించేవి. ఆధునిక జీవన విధానంలో స్మార్ట్ ఫోన్లు .. పని ఒత్తిడి పెరిగి మగవాళ్లలో శుక్రకణాల ఉత్పత్తి... సెక్స్ పై ఆశక్తి తగ్గిపోతున్నాయి.
ప్రస్తుతం మగవాళ్లలో సమస్యల కారణంగానే 35 నుంచి 40 శాతం జంటలు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇందులోనూ అధికశాతం శుక్రకణాల కౌంట్ తక్కువగా ఉన్నవాళ్లే ఉన్నారని,హైడ్రోసీల్,వెరికోసిల్ వంటి ఇతర సమస్యలతో బాధపడుతున్నవాళ్లు కొద్ది శాతమేనని ఆమె వివరించారు.
మగవాళ్లలో పెరుగుతున్న పని ఒత్తిడి. హైపర్ టెన్షన్ వల్ల టెస్టోస్టిరాన్ ఉత్పత్తి, నాణ్యత తగ్గిపోతున్నాయి. ఇన్ ఫెర్టిలిటీ (వ్యంధత్వ) సమస్య రోజు రోజుకూ పెరిగిపోవడానికి ఒత్తిడే ముఖ్య కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మగవాళ్లు ఏదో ఒక స్థాయిలో వ్యంధత్వ సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రత్యేకంగా మగవాళ్ల కోసమే నిర్వహించే 'మెన్స్ క్లినిక్స్' సంఖ్య పెరుగుతోంది..
రాత్రిళ్లు మేల్కొనడం.. రెగ్యులర్ ఆల్కహాల్..
శారీరక శ్రమ, ఆటలకు దూరమవడంతో ఈ కాలం పిల్లలకు చిన్న వయసులోనే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతోంది. దీంతో టీనేజీకి వచ్చేసరికి మగ పిల్లల్లోనూ బ్రెస్ట్ పెరగడం, లైంగిక వాంఛ తగ్గిపోవడం లాంటి సమస్యలు వస్తున్నాయి. మరోవైపు పోర్నోగ్రఫీ చూసి అందులో ఉన్నవాళ్లతో తమను పోల్చుకుని, తాము అలా చేయలేమన్న అపోహతో ఆత్మన్యూనతకు లోసవుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది.
ఈ రెండు సందర్భాల్లోనూ పెండ్లి చేసుకునేందుకు యువకులు వెనకాడుతున్నారు. భాగస్వామిని తృప్తి పర్చలేమోనన్న భయంతో పెండ్లి చేసుకుని ఒకటి రెండు సంవత్సరాల వరకూ సెక్స్ పాల్గొనకుండా ఉంటున్నారు. ఇందుకోసం ఏవో సాకులు వెతుక్కుంటున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో 70 నుంచి 80 శాతం మంది ఒత్తిడి, రాత్రిళ్లు మేల్కొని ఉండడం వల్ల లైంగిక సామర్థ్యాన్ని కోల్పోతున్నారు.
రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడం, రాత్రిళ్లు మేల్కొని ఉండడం, పని ఒత్తిడి, జంక్ ఫుడ్, శారీరక శ్రమ లేకపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత పెరుగుతుంది. దీంతో అనేక ఆనారోగ్య సమస్యలు వస్తాయి. సమయానికి నిద్రపోవడం, అయిల్, కొవ్వులు తక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం, ఆల్కహాల్ మానేయడం, ఒత్తిడి నుండి తట్టుకునేందుకు వ్యాయామం చేయడం ద్వారా వ్యంధత్వ సమస్య నుంచి బయటపడొచ్చని వైద్యులు చెబుతున్నారు..
