హైదరాబాద్ రోడ్లా! లేక సర్కస్ రింగులా!..సెక్రటేరియట్ దగ్గర పోకిరీల బైక్ స్టంట్స్

హైదరాబాద్ రోడ్లా! లేక సర్కస్ రింగులా!..సెక్రటేరియట్ దగ్గర పోకిరీల బైక్ స్టంట్స్

హైదరాబాద్ లోని కొత్త సచివాలయం,ట్యాంక్‌బండ్ పరిసరాలు ప్రమాదకరమైన బైకర్స్ స్టంట్లకు అడ్డగా మారాయి. సచివాలయం ముందు కొందరు యువకులు బైక్‌లతో ప్రాణాలకు పణంగా పెట్టి విన్యాసాలు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను గాలికొదిలేసి, అటుగా వెళ్లే ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. వీలింగ్స్, స్టాపింగ్స్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. సెల్ఫీలు, రీల్స్ పిచ్చితో రిస్క్ తీసుకుంటున్నారు యువత. కొసమెరుపేంటంటే పోలీసుల ముందే  పోకిరీలు స్టంట్స్ కలకలం రేపింది.   

హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం ప్రధాన రహదారి ఇప్పుడు బైక్ స్టంట్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అర్థరాత్రి వేళల్లోనే కాకుండా, పగటిపూట కూడా యువకులు బైక్‌లపై సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో అతి వేగంతో దూసుకుపోతూ, వీలింగ్స్ చేస్తూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. దీనివల్ల సాధారణ వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సీసీటీవీల ద్వారా నిఘా పెట్టి, భారీ జరిమానాలు విధిస్తున్నప్పటికీ ఈ ధోరణి తగ్గకపోవడం గమనార్హం.

►ALSO READ | హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి.. టపాసుల లోడు లారీ కాలిబూడిదయ్యింది

స్టంట్లు చేయాలనుకుంటే ప్రత్యేకమైన ట్రాక్స్ ,అనుమతి ఉన్న ప్రదేశాలకు చాలా ఉన్నాయి.  అయినప్పటికీ ఇలా పబ్లిక్ గా రోడ్లపై స్టంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కనీసం హెల్మెట్ లేకుండా  డ్రైవింగ్ చేయడం, వారికే కాదు  ప్రయాణికులకు ప్రాణహాని తప్పదని అంటున్నారు కమ్యూటర్స్. పోలీసులు స్పందించి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.