రంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. టపాసుల లోడుతో వెళ్తున్న లారీకి హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు మొత్తం వ్యాపించడంతో లారీ పూర్తిగా కాలి బూడిదయింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా పెంజర్లలో ఈ ఘటన జరిగింది.వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి జిల్లాలో కొత్తూరు మండలం పంజర్లలో శనివారం(మార్చి21) విద్యుత్ హైటెన్షన్ వైర్లు తగిలి మంటలు చెలరేగడంతో లారీ దగ్దమైంది. పెంజర్లనుంచి మాణిక్యం గూడకు వెళ్లే రోడ్డులో టపాసుల లోడ్ తో వెళ్తున్న లారీకి పెంజర్ల దగ్గర విద్యుత్ హైటెన్షన్ వైర్లు తగిలి మంటల చెలరేగాయి. క్షణాల్లో మంటలు లారీ మొత్తం వ్యాపించాయి. టపాసులు మొత్తం పేలిపోయి లారీ పూర్తిగా మంటల్లో కాలి బూడిదయ్యింది.
స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలార్పేందుకు ప్రయత్నించారు. అయితే ఫైర్ ఇంజన్ చేరుకునేలోపే లారీ మంటల్లో కాలి బూడియ్యింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
