బబ్బెర్లతో ఈజీగా బరువు తగ్గొచ్చు

బబ్బెర్లతో ఈజీగా బరువు తగ్గొచ్చు

అలసంద అంటే తెలుసా.? వీటిని మనం బబ్బెర్లు అని కూడా అంటారు. బబ్బెర్లు మంచి ఫ్లేవర్ ను కల్గి ఉండడం వల్ల వీటిని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. బబ్బెర్లలో ఉన్న పోషకాలు మన శరీరంలోని జీవక్రియలకు  ఉపయోగపడతాయి. బబ్బెర్లలో తక్కువ క్యాలరీలు తక్కువ ఫ్యాట్ ఉండడం వల్ల ఇవి బరువు తగ్గించడంలో ఉపయోగపడుతాయి.

బబ్బెర్లలో డైటరీ ఫైబర్ ఉండడం వల్ల వీటిని తీసుకుంటే బరువు తగ్గుతుంది. మధుమేహం వ్యాధి ఉన్న వారు వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల బ్లడ్, షుగర్ ను  కంట్రోల్ లో ఉంచుతుంది. బబ్బెర్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వల్ల  శరీరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా హానికర టాక్సిన్ ను నివారిస్తుంది. అంతేగాకుండా రక్తంలోని కొలెస్టరాల్ ను తగ్గించడమే గాకుండా హార్ట్ సంబంధిత వైరస్ ల నుంచి మనల్ని రక్షిస్తుంది.

బబ్బెర్లలో ఉండే ఫైబర్ పదార్థం జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. మలబద్దకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెన్స్, విటమిన్ ఏ,సీ లు చర్మానికి హానీ కాకుండా చర్మకణాలను రక్షిస్తాయి. బబ్బెర్లోబ ఉండే ఫ్లెవనాయిడ్స్ ,మినిరల్స్ పోటాషియం, మెగ్నిషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.