చైనాలో ఇన్ ఫ్లూయెంజా లాక్ డౌన్?

చైనాలో ఇన్ ఫ్లూయెంజా లాక్ డౌన్?

బీజింగ్ : కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకొని సాధారణ జీవితం గడుపుతున్న చైనా ప్రజలను ఇన్ ఫ్లూయెంజా రూపంలో మరో వైరస్  వెంటాడుతోంది. దీంతో షాంగ్జీ ప్రావిన్స్ లోని జియాన్ సిటీలో లాక్ డౌన్  విధించాలని చైనా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సిటీలో ఇన్ ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్నందున హోటళ్లు, రెస్టారెంట్లు, స్కూళ్లు వంటి పబ్లిక్  ప్లేసెస్ ను బంద్  చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.

అయితే లాక్ డౌన్  ఆలోచనను సిటీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోషల్  మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రపంచ పర్యాటక నగరాల్లో ఒకటైన జియాన్  సిటీలో గతంలో విధించిన కరోనా లాక్ డౌన్  కారణంగా బాగా నష్టపోయామని, మళ్లీ లాక్ డౌన్  విధించడం సరికాదని అక్కడి ప్రజలు సూచిస్తున్నారు. లాక్ డౌన్  విధించడం బదులు వ్యాక్సిన్  పంపిణీ చేస్తే బాగుంటుందని వారు సూచిస్తున్నారు.