పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం

పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి.. పలుకీలక బిల్లులకు లోక్ సభ ఇవాళ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షల్లో అక్రమాలను కట్టడిచేసేందుకు కీలక బిల్లును తీసుకొచ్చింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు-2024కు లోక్ సభ ఆమోదించింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ప్రతిభావంతులైన విద్యార్థులు, అభ్యర్థుల ప్రయోజనాలను కాపాడేందుకు దీన్ని తీసుకొచ్చామన్నారు. 

పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు-2024కు సంబంధించి విపక్ష సభ్యులు ప్రతిపాదించిన కొన్ని సవరణలు తిరస్కరణకు గురయ్యాయి. ఆ తర్వాత లోక్ సభ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే పేపరు లీకేజీ, మాల్ ప్రాక్టీస్, నకిలీ వెబ్ సైట్లను సృష్టించినా.. గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకూ జరిమానా పడనుంది. యూపీఎస్సీ, SCC, RRB, ఐబీపీఎస్ , NDA వంటి పోటీ పరీక్షలతోపాటు నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి ప్రవేశ పరీక్షలకూ వర్తించనుంది .