ఓటింగ్​శాతంపై దృష్టి పెట్టని అధికారులు

ఓటింగ్​శాతంపై దృష్టి పెట్టని అధికారులు

నగరంలో ఓటింగ్​శాతం తగ్గిందా? లేదా, ఓటరు లిస్టుల్లోనే ఒక ఓటరు రెండు చోట్ల ఓటు కలిగి ఉన్నారా? అలాగే, ఓటరు స్లిప్​లు ఇంటింటికి పంపిణీ చేశారా? అంటే దేనికీ సరైన సమాధానాలు లేవు. ఇవే కాకుండా నగరం నుంచి ఆంధ్రాలో ఓటేయడానికి లక్షల్లో వెళ్లారు. అలాగే తెలంగాణ గ్రామాలకూ ఓటేయడానికి వెళ్లిన వారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

ఇన్ని కారణాలను వదిలేసి  ఓటేయడానికి నగర ప్రజలకు బద్దకం ఎక్కువ అని అటు మీడియా, ఇటు విశ్లేషకులు మాట్లాడటంలో అర్థం లేదు. ఎన్నికల అధికారులు ఓటరు స్లిప్పులను ప్రతి ఓటరుకు పంపిణీ చేసిఉంటే, ఓటింగ్​ శాతం కాస్తైనా పెరిగేది. ఓటరు స్లిప్​ లేని నగరంలోని కొత్త ఓటరు పోలింగ్​ బూత్​ ఎక్కడ ఉన్నదో తెలుసుకోలేకపోయిన వారూ ఉన్నారు. ఇలా ఎన్నికల అధికారులు ఓటింగ్​ పెంచే ప్రయత్నం చేస్తున్నామని చెపుతూనే, మరో వైపు ఓటర్​ స్లిప్​ల పంపిణీని పర్యవేక్షించకపోవడం శోచనీయం. 

- రాజ్యలక్ష్మి,
ఉప్పర్​పల్లి, రాజేంద్రనగర్​