మే 20 నుంచి దోస్త్ వెబ్ ఆప్షన్లు

మే 20 నుంచి దోస్త్ వెబ్ ఆప్షన్లు

హైదరాబాద్, వెలుగు:  డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్  వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 20 నుంచి ప్రారంభమవుతుందని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. 30వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. దోస్త్ ఫస్ట్ ఫేజ్ రిజిస్ర్టేషన్ల ప్రక్రియ ఈ నెల 6న ప్రారంభం కాగా.. 29 వరకూ గడువు ఉందని పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకూ 29,664మంది  దోస్త్ రిజిస్ర్టేషన్ చేసుకున్నట్టు లింబాద్రి వెల్లడించారు. 
 

మరిన్ని వార్తలు