భూసార పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేయాలి

భూసార పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేయాలి

రైతులు ఏదైనా పంటను పండించాలంటే దానికి ముఖ్యంగా కావాల్సింది సాగు భూమి, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, నీరు. ఇవి ప్రధానమైనవి. వీటితో పాటు అప్పుడప్పుడు భూసార పరీక్షలు చేయడం  అవసరం. దీనికోసం భూమిలోని  మట్టి నమూనాలను సేకరించి  పరీక్షలు జరిపించాలి. అలాగే ఎటువంటి ఎరువులను వినియోగించాలో, వాటిని ఏ మేరకు అందించాలో అన్నదాతలకు ఒక అవగాహన వస్తుంది.

చాలామంది కర్షకులు భూసార పరీక్షలు చేయించకుండా అధిక మొత్తంలో రసాయనిక ఎరువులను వాడటం వల్ల పెట్టుబడి ఖర్చులు పెరిగి, పంట దిగుబడి తగ్గుతోంది. రైతులు దుక్కి దున్నడానికి ముందుగానే భూసార పరీక్షలు చేయడం చాలా అవసరం. తెలంగాణ రాష్ట్రంలో భూసార పరీక్షా కేంద్రాలు అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల అన్నదాతలు ఇటువంటి విషయాల్లో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. 

- కె. శ్రావణ్
కొండాపూర్, జనగామ జిల్లా