బండి సంజయ్ అరెస్ట్ ఘటనపై లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ సీరియస్

బండి సంజయ్ అరెస్ట్ ఘటనపై లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ సీరియస్

కరీంనగర్ జాగరణ దీక్ష సందర్భంగా..తనపై పోలీసులు దాడి చేశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన ఫిర్యాదుపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టింది. సీఎస్ సోమేశ్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ గుప్తా, డీజీపీ మహేందర్ రెడ్డి, కరీంనగర్ సీపీ సత్యనారాయణ సహా బాధ్యులైన పోలీసు అధికారులకు సమన్లు జారీ చేసింది లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ. ఫిబ్రవరి 3న విచారణకు హాజరు కావాలని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ సునీల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. వీరితో పాటు హుజూరాబాద్ ఏసీపీ, జమ్మికుంట, హుజూరాబాద్, కరీంనగర్ వన్-టౌన్  ఇన్ స్పెక్టర్లకు కూడా సమన్లు జారీ చేసింది ప్రివిలేజ్ కమిటీ. ఎంపీ కార్యాలయంతో పాటు తనపై దాడి జరిగినట్లు.. బండి సంజయ్ ఇచ్చిన ఆధారాలను, వీడియో క్లిప్పింగులను ప్రివిలేజ్ కమిటీ పరిశీలించింది. నిన్ననే బండి సంజయ్ ఢిల్లీలో లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ ముందు హజరయ్యారు. కరీంనగర్ లో తనపై జరిగిన దాడిలో బాధ్యుడైన CP సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని కోరారు.