పెట్రోలింగ్ వెహికల్స్ను ఢీకొట్టిన లారీ.. హెడ్ కానిస్టేబుల్ మృతి.. ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్న టైంలో ఘటన

పెట్రోలింగ్ వెహికల్స్ను ఢీకొట్టిన లారీ.. హెడ్ కానిస్టేబుల్ మృతి.. ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్న టైంలో ఘటన

శంషాబాద్, వెలుగు: నేషనల్​హైవేపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్​వెహికల్స్​ను వెనుక నుంచి లారీ ఢీకొట్టగా, హెడ్​కానిస్టేబుల్​ఒకరు మృతి చెందారు. ఈ ఘటన శంషాబాద్ రూరల్ పీఎస్​పరిధిలోని ఎన్ హెచ్44పై జరిగింది. ఇన్​స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున పెద్ద షాపూర్ వద్ద ఎన్ హెచ్ 44పై ఓ లారీ అదపు తప్పిందని పోలీసులకు సమాచారం అందింది. పెట్రోలింగ్​డ్యూటీ చేస్తున్న శంషాబాద్​రూరల్​పీఎస్​లోని హెడ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్, మరో కానిస్టేబుల్ డి.చెన్నయ్య వెంటనే అక్కడి వెళ్లారు. మరో పెట్రోలింగ్​వెహికల్​లో ఏఆర్ హెడ్​కానిస్టేబుల్​యాదయ్య, హోంగార్డు శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.

లారీని పక్కకు తీసి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న టైంలో కర్ణాటక రిజిస్ట్రేషన్​తో ఉన్న ఓ లారీ అతివేగంగా వచ్చి పోలీస్​పెట్రోలింగ్​వెహికల్స్​ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హెడ్​కానిస్టేబుల్​విజయ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఏఆర్​హెడ్​కానిస్టేబుల్​యాదయ్య, హోంగార్డు శ్రీనివాస్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని గచ్చిబౌలిలోని యశోద హాస్పిటల్ కు తరలించారు. విజయ్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కుర్వగూడకు తరలించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. శంషాబాద్ జోన్ డీసీపీ రాజేశ్, ఏసీపీ శ్రీకాంత్ గౌడ్, ఇన్​స్పెక్టర్​నరేందర్ రెడ్డి, విజయ్ కుమార్ 2006 బ్యాచ్ మేట్లు పాల్గొన్నారు.

బైక్​ అదుపు తప్పి యువకుడు..
ఓయూ/మేడిపల్లి: బైక్​అదుపు తప్పి ఓయూ పీఎస్​పరిధిలో ఓ యువకుడు చనిపోయాడు. ఆలుగడ్డ బావి మెట్టుగూడకు చెందిన మాధవన్(21) ఉప్పల్ లోని యమహా షోరూంలో వాషింగ్​బాయ్​గా పని చేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున బైక్​పై ఇంటికి వస్తుండగా, అదుపు తప్పి హబ్సిగూడలోని డివైడర్ ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన మాధవన్​ను గాంధీ హాస్సిటిల్​కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడి తల్లి పుష్పవల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

కారు ఢీకొని బాలుడు..
ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని కారు ఢీకొట్టడంతో మృతి చెందాడు. పర్వతాపూర్ భూలక్ష్మినగర్ కాలనీకి చెందిన చౌహన్ రాజకుమార్ కొడుకు విజయరాజ్(18 నెలలు) శనివారం రాత్రి ఇంటి బయట ఆడుకుంటుండగా, పక్కింట్లో ఉండే శ్రీనాథ్ తన కారును నిర్లక్ష్యంగా డ్రైవ్​చేస్తూ ఢీకొట్టాడు. విజయ్ రాజ్ తలపై నుంచి కారు వెళ్లడంతో తీవ్రంగా గాయపడి చనిపోయాడు. కేసు నమోదైంది.