ప్రేమ జంట ఆత్మహత్య .. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి

ప్రేమ జంట ఆత్మహత్య .. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి

ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో విషాదం నెలకొంది. రెండు రోజుల వ్యవధిలోనే ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన మంకు నాగరాజు (26), పంబాల నందిని (18) కొన్నేండ్లుగా ప్రేమించుకున్నారు. వీరిద్దరి మధ్య స్వల్ప గొడవ జరగడంతో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నందిని ఉరేసుకొని మృతి చెందింది. అయితే, నందిని మృతికి కారణమైన నాగరాజుపై చర్యలు తీసుకోవాలంటూ మంచాల పీఎస్​ఎదుట బాధిత కుటుంబసభ్యులు మంగళవారం ధర్నాకు దిగారు. ఈ క్రమంలోనే నందిని మృతితో తీవ్ర మనస్తాపానికి గురైన నాగరాజు బుధవారం గ్రామ శివారులోని చింత చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.