‘లవ్ రెడ్డి’ ఫస్ట్ లుక్‌‌‌‌

‘లవ్ రెడ్డి’ ఫస్ట్ లుక్‌‌‌‌

అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా స్మరన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ రెడ్డి’. హేమలత రెడ్డి, మదన్ గోపాల్ రెడ్డి, ప్రభంజనం రెడ్డి, నాగరాజు బీరప్ప కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌‌‌‌ను దర్శకుడు ప్రశాంత్ వర్మ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ‘ఫస్ట్ లుక్ చాలా ఫ్రెష్ గా ఉంది. 

ఇది చూస్తుంటే  నాకు కూడా ఒక లవ్ స్టోరీ చేయాలని అనిపించింది. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పాడు. స్మరన్ మాట్లాడుతూ ‘ఆంధ్ర , కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో జరిగే ప్రేమకథ ‘లవ్ రెడ్డి’. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది’ అన్నాడు. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు అంజన్ రామచంద్ర, శ్రావణి.