సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. పాయిజన్ తాగిన ప్రేమికుడు

సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. పాయిజన్ తాగిన ప్రేమికుడు

ప్రేమలో గెలిస్తే.. అడ్డే ఉండదు. అదే ఓడితే.. ఏదీ పట్టదు. అలా తమ ప్రేమ విఫలమవుతుందనే బాధతో ప్రేమికులు పురుగుల మందు తాగి చనిపోయారు. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డలో జరిగింది. గ్రామానికి చెందిన మౌనిక, పవన్‌లు కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోరనే భయంతో.. మౌనిక గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. 
ప్రియురాలు మరణం తట్టుకోలేక ప్రియుడు పవన్ కూడా శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పవన్.. పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు రోజుల్లో ఒకరి తర్వాత ఒకరు ప్రేమికుల జంట ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.