పురుగుల మందు తాగుతూ సెల్ఫీ తీసి పంపిన లవర్స్

V6 Velugu Posted on Jul 29, 2021

  • అంతపురం జిల్లా కదిరి రూరల్ మండలం కుమ్మరివారిపల్లె వద్ద లవర్స్ ఆత్మహత్యాయత్నం
  • హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు
  • గతంలో ఇదే జంటకు మైనారిటీ తీరలేదని కౌన్సెలింగ్ ఇచ్చి పంపిన పోలీసులు
  • మైనారిటీ తీరడానికి 2 నెలల ముందే ఇంట్లో నుంచి పారిపోయిన లవర్స్

అనంతపురం: కదిరి రూరల్ మండలం కుమ్మరివారిపల్లె వద్ద గురువారం ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పురుగుల మందు తాగుతూ సెల్ఫీ తీసుకున్న వీరు సదరు వీడియోను పోలీసులకు పంపారు. తల్లిదండ్రలు ఫిర్యాదుతో అమ్మాయి మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలిస్తున్న పోలీసులకు అమ్మాయి అఘాయిత్యం చేసుకుంటున్నట్లు వీడియో రావడంతో ఖంగుతిన్నారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. ప్రేమ జంట సూసైడ్ అటెంప్ట్ వీడియోను తమ సన్నిహితులకు పంపడంతో స్థానికంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ కలకలం రేపుతోంది. 
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ఎగువబోయపల్లికి చెందిన ప్రేమజంట వ్యవహారంలో కొద్ది రోజుల క్రితమే తంబళ్లపల్లి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. అంతకు ముందే అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదుతో మైనర్ అయిన అమ్మాయికి.. ఆమె ప్రియుడు.. అతని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. అయితే అమ్మాయికి మైనారిటీ తీరడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఈలోపే వీరి జంట ఇల్లు వదిలి పారిపోయారు. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తంబల్లపల్లి పోలీస్ స్టేషన్ లో అమ్మాయి పై మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలిస్తున్నారు. ఇంతలోనే ఘటన జరిగింది.
‘‘నాకు పెళ్లి చేస్తానంటుంటే.. నాకై నేనే ఇంట్లో నుంచి వెళ్లిపోయా. అబ్బాయిని నేనే పిలుచుకుని వచ్చా. మా తల్లిదండ్రులకు చిక్కితే వారు విడదీస్తారు.. మీకు దొరికినా మీరు కూడా విడదీస్తారు.. కాబట్టి మాకు ఈ జీవితం వద్దు.. మేం చనిపోతున్నాం..’’ అంటూ ఇరువురు వీడియోలో మాట్లాడుతూ కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని తాగారు. సదరు వీడియోను పోలీసులతోపాటు తమ సన్నిహితులకు షేర్ చేయడంతో వారున్న ప్రాంతాన్ని గుర్తించి కాపాడేందుకు పోలీసులు హుటాహుటిన బయలుదేరారు. 
 

Tagged Minor girl, Chittoor District, , thamballapalli constituency, kummarivaripalem village, lovers suicide selfie, lover selfie while drinking insecticides

Latest Videos

Subscribe Now

More News