గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు.. నేటి నుండి అమల్లోకి..

గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు.. నేటి నుండి అమల్లోకి..

 ఇవాళ (నవంబర్ 1) చమురు కంపెనీలు దేశవ్యాప్తంగా LPG సిలిండర్ ధరలను సవరించాయి. దింతో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.5 తగ్గింది. అయితే కొత్త రేటు  ఇవాళ్టి   నుండి నవంబర్ 1 నుండి వర్తిస్తుంది.  ఇక దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోగ్రాముల వాణిజ్య LPG సిలిండర్  కొత్త ధర రూ.1590.50 ఇంతకుముందు రూ.1595.50. మరోవైపు 14.2 కిలోల వంటింటి సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. 

వాణిజ్య సిలిండర్లను ఎక్కువగా హోటళ్ళు, రెస్టారెంట్లు, ధాబాలు, ఇతర వాణిజ్య వ్యాపారాలు  ఉపయోగిస్తారు. గత నెల అక్టోబర్‌లో వాణిజ్య సిలిండర్ల ధర రూ.15 పెరిగింది. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం ప్రస్తుత తగ్గింపుతో  నవంబర్ 1 నుండి 19కిలోల LPG సిలిండర్ల కొత్త ధర ముంబైలో రూ.1,542, కోల్‌కతాలో రూ.1,694, చెన్నైలో రూ.1,750,  హైదరాబాద్‌లో రూ.1,812.50. 

వంటింటి గ్యాస్ ప్రస్తుత ధర ఎంతంటే :

ఇళ్లలో/వంటింట్లో ఉపయోగించే 14.2 కిలోల LPG సిలిండర్ ధర చివరిసారిగా అంటే ఏప్రిల్ లో మారింది. ఢిల్లీలో 14.2 కిలోల వంట గ్యాస్ ప్రస్తుత ధర రూ.853, కోల్‌కతాలో రూ.879, ముంబైలో రూ.852.50, చెన్నైలో రూ.868.50, లక్నోలో రూ.890.50, హైదరాబాద్‌లో రూ.905, బెంగళూరులో రూ 855. అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు పెరిగాయని, డాలర్ విలువ కూడా తగ్గిందని నిపుణులు అంటున్నారు.