PBKS vs LSG : IPL2023లో విధ్వంసం.. ఆల్ టైం హైయెస్ట్ టోటల్ క్రియేట్ చేసిన లక్నో

PBKS vs LSG : IPL2023లో విధ్వంసం.. ఆల్ టైం హైయెస్ట్ టోటల్ క్రియేట్ చేసిన లక్నో

మొహాలిలో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో బౌలర్లు విధ్వంసం సృష్టించారు. పంజాబ్ బౌలర్లపై  ఎదురుదాడికి దిగుతూ.. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. కైల్ మేయర్స్ 54, ఆయుష్ బదోని 43, స్టోయినిస్ 72, పూరన్ 45 రన్స్ తో బీభత్సం సృష్టించారు. లక్నో ఇన్నింగ్స్ లో 14 సిక్సర్లు, 27 ఫోర్లు నమోదయ్యాయి. దీంతో లక్నో 257 పరుగులు చేసింది. ఈ సీజన్ లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం.

మొత్తం ఐపీఎల్ 16 సీజన్లలో రెండవ అతిపెద్ద స్కోర్ ను నమోదు చేసింది లక్నో. మొదటి స్థానంలో బెంగళూరు 263 పరుగులు (2013లో) ఉంది. రెండవ స్థానంలో లక్నో నిలిచింది. మూడో స్థానంలో బెంగళూరు 248 పరుగులు (2016లో), చెన్నై 246 పరుగులు (2010లో) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.