
చొప్పదండి, వెలుగు: కరీంనగర్జిల్లా చొప్పదండి మండలం రాంలింగంపల్లి వెదురుగట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం నిర్వాహకులు లక్కీడ్రా కింద 4 యూరియా బస్తాలు ప్రైజ్గా పెట్టడం ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం యూరియా బస్తాల కొరత ఉండడంతో నిర్వాహకులు డిఫరెంట్గా ఆలోచించారు. రూ.50 కూపన్కు ఫస్ట్ ప్రైజ్ కింద తైవాన్స్ర్పేయర్, సెకండ్ప్రైజ్కిందచార్జింగ్స్ర్పేయర్, థర్డ్ ప్రైజ్కింద 4 యూరియా బస్తాలు అందిస్తామని ప్రకటించారు. గ్రామంలో ప్రకటించిన బహుమతి భిన్నంగా ఉండడంతో డ్రా కూపన్లు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.-