లక్కు కలిసొచ్చింది.. హైదరాబాద్లో ప్రశాంతంగా వైన్షాపుల లక్కీ డ్రా

లక్కు కలిసొచ్చింది.. హైదరాబాద్లో ప్రశాంతంగా  వైన్షాపుల లక్కీ డ్రా

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్​లో 2025–2027 కాలానికి సంబంధించి మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు సోమవారం ముగిసింది. జూబ్లీహిల్స్​లోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్​భవన్​లో జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి లాటరీ పద్ధతిలో డ్రా నిర్వహించారు.

 సికింద్రాబాద్ డివిజన్​లో 3,022 దరఖాస్తుల నుంచి 97 షాపులు, హైదరాబాద్ డివిజన్​లో 3,201 దరఖాస్తుల నుంచి 82 షాపులు కేటాయించారు. మొత్తం 179 షాపులకు 6,223 దరఖాస్తులు రాగా, పారదర్శకంగా దరఖాస్తుదారుల సమక్షంలో టోకెన్​ల ద్వారా డ్రా నిర్వహించామని కలెక్టర్ తెలిపారు.

 ఫొటో, వీడియోలతో ప్రక్రియను రికార్డు చేసి, పకడ్బందీగా డ్రా తీశామన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొనగా, డ్రా ప్రశాంతంగా జరిగిందని, అధికారులను కలెక్టర్ అభినందించారు.