నిర్మల్ జిల్లాలో లంపీ స్కిన్ వైరస్ కలకలం రేపుతోంది. భైంసా మండలంలో 22 పశువులకు లంపీ స్కిన్ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. టాక్లి, బాబుల్ గాం, కమోల్ తో పాటు భైంసా పట్టణంలో కూడా పశువులకు లంపీ స్కిన్ వైరస్ సోకింది. ఇందులో 20 పశువులు కోలుకోగా.. మరో రెండు పశువులకు అధికారులు వైద్యం అందిస్తున్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. హర్యానా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ లో ఈ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్రంలోనూ రైతులు అప్రమత్తంగా ఉండాలని పశు వైద్యులు సూచించారు.
